శ్రీ సరస్వతీ శిశు మందిర్, పాఠశాలలో ఘనంగా గురు పౌర్ణమి పూజా యజ్ఞం నిర్వహణ
- VISIONBHARAT NEWS
- Jul 29
- 1 min read
Updated: Jul 31

కరీంనగర్, జూలై 29 (VISION BHARAT NEWS): స్థానిక శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఇ. మీ హైస్కూల్లో గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, యజ్ఞం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గురుపరంపర వైభవాన్ని చాటి చెప్పే ఈ పవిత్ర దినాన విద్యార్థులు, ఆచార్యులు కలిసి గురువుల పట్ల కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేశారు. గురు పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి రోజున జరుపుకునే భారతీయ సంప్రదాయంలోని ప్రముఖ పర్వదినం.ఈ కార్యక్రమంలో ఇంజనీర్ కోల అన్నారెడ్డి, పులల శ్యామ్, డా || ఎలగందుల శ్రీనివాస్ యజ్ఞం లో పాల్గొనగా జ్యోష్యం అనుదీప్ వేద మంత్రోచ్చారణలతో యజ్ఞం నిర్వహించారు. భారతీయ సంస్కృతి, గురు-శిష్య పరంపర గొప్పతనాన్ని ప్రతిబింబించేలా గురుపూజ నిర్వహించారు. యజ్ఞంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ దేశం, సమాజం, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రార్థనలు చేశారు.

ముఖ్య వక్త డాక్టర్ లెక్కల రాజభాస్కర్ రెడ్డి గురువు యొక్క గొప్పతనం, భారతీయ సంస్కృతిలో గురువు స్థానాన్ని విశదీకరిస్తూ ప్రసంగించారు. గురువు కేవలం విద్యను బోధించే వ్యక్తి మాత్రమే కాకుండా, విద్యార్థి వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శి అని పేర్కొన్నారు. మన సంస్కృతిలో "గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వరః" అనే భావనకు ఉన్న విశిష్టతను వివరించారు.విద్యార్థులు గురువుల పట్ల వినయం, క్రమశిక్షణ, గౌరవ భావాలను పెంపొందించుకోవాలని, గురువులు చూపిన మార్గంలో నడుస్తూ సమాజానికి ఆదర్శ పౌరులుగా ఎదగాలని ఆయన సూచించారు. భారతీయ గురు-శిష్య పరంపర విశిష్టతను ఉదాహరణలతో వివరిస్తూ, గురు పూజ ద్వారా గురువుల పట్లకృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేయడం ప్రతి విద్యార్థి బాధ్యత అని అన్నారు. అనంతరం విద్యాపీఠం ప్రశిక్షణ వర్గలో ఉత్తిర్ణత సాధించిన ఆచార్యులందరికి ధ్రువీకరణ పత్రం అందచేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానాచార్యులు మోర రణధీర్ , ఆచార్యులు, విద్యార్థులు పాల్గొని గురువులకు పుష్పాంజలి ఘటించి వారి ఆశీర్వాదాలు పొందారు.


Comments