top of page

చదువుతో పాటు అన్ని రంగాల్లో చురుకుగా పాల్గొనేలా కార్యక్రమాలు నిర్వహిస్తాం- పాఠశాల డైరెక్టర్ సింహాచలం హరికృష్ణ

Updated: Aug 15


కరీంనగర్, ఆగస్టు 14 (విజన్ భారత్ న్యూస్): జాన్సన్ గ్లోబల్ హై స్కూల్‌లో ప్రమాణ స్వీకార వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఎస్.ఆర్.ఆర్. కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ డా. మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి, నూతన విద్యార్థి నాయకులతో ప్రమాణ స్వీకారం చేయించారు.విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు, ఎన్నికల ప్రక్రియ మరియు నాయకత్వ లక్షణాలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈఎన్నికల ప్రక్రియలో 5వతరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.పాఠశాలలో విద్యార్థులను నాలుగు హౌస్‌లుగా విభజించారు. గంగా, యమునా, కృష్ణా, గోదావరి హౌస్‌లకు 10వ తరగతి విద్యార్థులను హౌస్ కెప్టెన్లుగా, 9వ తరగతి విద్యార్థులను వైస్ కెప్టెన్లుగా ఎంపిక చేశారు.ఈ సందర్భంగా నూతన హౌస్ కెప్టెన్లు, వైస్ కెప్టెన్లు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, క్రమశిక్షణతో వ్యవహరిస్తామని ప్రమాణం చేశారు.అనంతరం పాఠశాల డైరెక్టర్ సింహాచలం హరికృష్ణ మాట్లాడుతూ, “మా పాఠశాలలో విద్యార్థులకు చదువుతో పాటు అన్ని రంగాల్లో చురుకుగా పాల్గొనేలా వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యత, క్రమశిక్షణ, సృజనాత్మకత మరియు సేవాభావాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయి” అని తెలిపారు. ముఖ్య అతిథి డా. మధుసూదన్ రెడ్డి విద్యార్థులను అభినందిస్తూ, విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, డైరెక్టర్లు, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

 
 
 

Comments


bottom of page