ప్రపంచ మానవ అక్రమ రవాణా నిర్మూలన దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం
- VISIONBHARAT NEWS
- Jul 31
- 1 min read

కరీంనగర్, జూలై 30 (VISION BHARAT NEWS): ప్రపంచ మానవ అక్రమ రవాణా నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ పాఠశాల ఆరెపల్లి లో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మానవ అక్రమ రవాణా నిర్మూలన SI మాట్లాడుతూ దేశంలో అక్రమ రవాణా ఇప్పటికీ జరుగుతుందని, అమ్మాయిలను ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేస్తున్నారని, అబ్బాయిలను మత్తు పదార్థాలకు బానిస చేసి వివిధ దేశాలకు అక్రమ రవాణా చేస్తుంటారు అని పిల్లలు ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి మరియు ఇంటికి వెళ్లిన తర్వాత ఫోన్ తో ఆడకుండా ఫిజికల్ గా ఫిట్ ఉండడం, మానసికంగా ఆనందం ఉండడం కోసం ఆటలు ఆడాలని అని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆవుల సంపత్ చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్, శ్రీలత జిల్లా మహిళా సాధికారత కేంద్రం, కమ్యూనిటీ కో ఆర్డినేటర్ తిరుపతి, ఇంచార్జి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డా.డిబోరా కృపారాణి, ASI మల్లేశం, షీ టీం సిబ్బంది మరియు పాఠశాల ఉపాధ్యయిని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


Comments