ఉత్సాహభరితంగా గోరింటాకు సంబరాలు
- VISIONBHARAT NEWS
- Jul 31
- 1 min read
కరీంనగర్, జూలై 30 (VISION BHARAT NEWS): స్థానిక శ్రీ సరస్వతీ శిశు మందిర్ లో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని గోరింటాకు సంబరాలు సంప్రదాయబద్ధంగా, ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అప్పిడి వకుల దేవి, గీకురు కృష్ణవేణి,మాతాజీలు,విద్యార్థు

లు పాల్గొని ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుని ఆనందాన్ని పంచుకున్నారు.ఈ సందర్భంగా పాఠశాల కార్యదర్శి ఇంజనీర్ కోల అన్నారెడ్డి మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. గోరింటాకు ప్రాముఖ్యత, ఆషాఢ మాస విశిష్టత, భారతీయ కుటుంబ విలువల గురించి విద్యార్థులకు వివరించారు.విద్యార్థులు సంప్రదాయ పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకోగా, పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పట్ల గౌరవం, అవగాహన పెంపొందించడమే లక్ష్యమని పాఠశాల ప్రదానాచార్యులు మోర రణదీర్ తెలిపారు.


Comments