అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో ఎన్సిసీ రిపబ్లిక్ డే పరేడ్ డే క్యాంప్
- VISIONBHARAT NEWS
- Jul 31
- 1 min read

కరీంనగర్,జూలై 30 (VISION BHARAT NEWS): రిపబ్లిక్ డే పరేడ్ లో ఎన్సిసీ క్యాడెట్లు పాల్గొనడం చాలా అదృష్టంగా భావించాలని పాఠశాల నిర్వాహకులు ఎన్సిసి అధికారులతో కలిసి ఎన్సిసి క్యాడెట్లకు రిపబ్లిక్ డే క్యాంపు లో పాల్గొనేందుకు నిర్వహించినటువంటి పరీక్ష నిర్వహణకు హాజరై వారు మాట్లాడారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్సిసి లో చేరిన ప్రతి విద్యార్థి కేవలం సర్టిఫికెట్ కోసమే కాకుండా క్రమశిక్షణ, నాయకత్వం, దేశభక్తి, సేవస్ఫూర్తి, అని అమూల్యమైన జీవిత విలువలను కూడా నేర్చుకుంటారని మరియు అమలుపరస్తారని వారు చెప్పారు రాజపథ్/ కర్తవ్య పథ్ పై అడుగులు వేయడం ప్రతి ఎన్సిసి క్యాడెట్ కు జీవితంలో అత్యున్నత గౌరవమని గుర్తు చేస్తూ పాల్గొనే అవకాశం ఎన్సిసి క్యాడెట్ కు లభించే అత్యున్నత జాతీయ గౌరవాలలో ఒకటని తెలుపుతూ దేశవ్యాప్తంగా ఉన్న లక్షణాది ఎన్సిసి క్యాడెట్లలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కొద్దిమందికే ఈ అరుదైన అవకాశం లభిస్తుందని తెలుపుతూ, క్రమశిక్షణ, పరేడ్ నైపుణ్యం, శారీరక దారుడ్యం, నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వం వంటి అంశాల్లో ప్రతిభను నిరూపించిన వారినే ఎంపిక చేస్తారని గుర్తు చేశారు. రాష్ట్ర స్థాయి, గ్రూప్ స్థాయి, డైరెక్టరేట్ స్థాయి కఠినమైన ఎంపిక శిబిరాలను విజయవంతంగా పూర్తి చేసిన క్యాడేట్లే ఢిల్లీకి ఎంపిక అవుతారని గుర్తు చేశారు. విద్యార్థులు అందరూ ఎన్సిసి అధికారులు తెలిపిన విధివిధానాలను చక్కగా పాటించి అర్హత సాధించాలని వారు ఆకాంక్షించారుఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ కల్నల్ కృష్ణమూర్తి గారు, సంగారెడ్డి, హావిల్దార్ దేవేంద్ర సింగ్, అదిలాబాద్, సుబేదార్ జంగ్ బాజ్ ఖాన్, సునీల్ కుమార్, సుబేదార్ నిజామాబాద్, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు


Comments